Friday, November 04, 2005

దేవుడా

దేవుడా
నన్ను వీళ్ళు రక్షిస్తున్నారు
గిడుగు భాషోద్యమాన్నించి
ఇంగ్లీషు చదువుల్నించి
ఇంటి భాషనుంచి
వెల్చేరు విప్లవాలనుంచి
తల తిక్క వాదాలనుంచి
తాళ్ళకు తాళ్ళు పేనుతూ
సాంస్కృతిక కరవాలాలతో
మాలలతో, భాషణ భూషణాలతో
తెలుగుదనంతో
నన్ను
వీళ్ళు రక్షిస్తున్నారు.

దేవుడా!
వీళ్ళకు రక్షించడమే పని.

దేవుడా!
నువ్విటు రాకు.
అంతగా టైముంటే
చేతులు మరీ ఖాళీగా ఉంటే
వెళ్ళి వేలూరి వంటకాలు తిను.
(పెసరట్లు ఆయన స్పెషాలిటీ.)
సిలికానాంధ్ర సైనికుల్లో కలువు.
ఇంకా తోచకపోతే
విప్లవ రచయితల్లో చేరు.
అంతే గానీ ఇటువైపు మటుకు రాకు.
నిన్నుకూడా
వీళ్ళు రక్షించేస్తారు.

-విప్లవ్
(రచయిత్రి రేవతీ దేవి had it right).

0 Comments:

Post a Comment

<< Home